
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కోడుమూరు రూరల్: ఆర్టీసీ బస్సు గేర్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శుక్రవారం మండల ంలోని వెంకటగిరి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కోడుమూరు నుంచి వెల్దుర్తికి 21 మంది ప్రయాణికులతో డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బయలుదేరింది. అయితే వెంకటగిరి గ్రామం దాటిన తర్వాత అనుగొండ రోడ్డులో బస్సుకు సంబంధించిన గేర్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరు క్షేమంగా బయటపడ్డారు.
13న నర్సెస్ అసోసియేషన్ సమావేశం
కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 13వ తేదిన నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఎం. లీలావతి చెప్పారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి సి.బంగారి, ట్రెజరర్ కె.లక్ష్మీనరసమ్మలతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సర్వసభ్య సమావేశం ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ, జనరల్ సెక్రటరి ఎస్. కోటమ్మ హాజరవుతారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని సభ్యులందరూ తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని కోరారు.
‘పల్లెకు పోదాం’ను విజయవంతం చేయండి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నేటి (శనివారం) నుంచి ‘పల్లెకు పోదాం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 79 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్లు చెప్పారు. శుక్రవారం ఆయన మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పల్లెలను బాగు చేయాలన్న ఉద్దేశంతో పల్లెకు పోదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతి మండలంలో 3 గ్రామాలు చొప్పున 79 గ్రామాలను ఎంపిక చేశామని, ఇందుకోసం 79 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. వారు ఏ గ్రామాలకు వెళ్లాలనే విషయాన్ని వారికి తెలిపినట్లు చెప్పా రు. వీరంతా శనివారం ఉదయం 9 గంటలకు నిర్ధేశించిన గ్రామానికి చేరుకొని పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, హాస్పిటళ్లు, హాస్టల్ తదితర ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలన చేస్తారు. తాగునీటి సరఫరా, వైద్య సేవలు, ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం కార్యక్రమాలను పరిశీలిస్తారన్నా రు. నిర్దేశించిన గ్రామాలకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఓఆర్‌డీ తమ బృందాలతో స్పెషల్ ఆఫీసర్ వెంట వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా సహృదయంతో నిర్వహించాలన్నారు. స్వచ్ఛాంధ్ర అ వార్డులకు సంబంధించి ఆయా శాఖలు సమాచారాన్ని 9లోపు పంపాలన్నారు. జెడ్పీ సీ ఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్ పాల్గొన్నారు.

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు