
రక్త పరీక్షలు చేయించండి
జూపాడుబంగ్లా: జ్వరాల బారిన పడిన వారికి రక్త పరీక్షలు చేయించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మౌలిక వసతులను గురించి డాక్టర్ గంగాధర్‌ను అడిగి తెలుసుకున్నారు. విషజ్వరాలు వ్యాపించకుండా నిరంతరం ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించాలన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు. అనంతరం సమీపంలోని కస్తూర్బా పాఠశాలను పరిశీలించి అందులోని విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులపై ఆరా తీశారు. ఎవ్వరికై నా జ్వరం, వాంతులు, విరేచనాలు, దగ్గు, జలుబు, జ్వరం, డెంగూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించినట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈయన వెంట హెల్త్‌సూపర్‌వైజర్లు విజయలక్ష్మమ్మ, రాముడు, ల్యాబ్‌అసిస్టెంటు చెంచన్న, వైద్యసిబ్బంది ఉన్నారు.