
‘గురు’ స్మరణీయులు
● జిల్లాలో 47 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
● ముగ్గురికి రాష్ట్ర స్థాయి పురస్కారాలు
కర్నూలు సిటీ: ఆన్‌లైన్ పాఠాల సంస్కృతి పెరుగుతున్న నేటి ఆధునిక కాలంలో వారు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారు. అక్షరాలను దిద్దించడమే కాదు..అజ్ఞాన తెరలను తొలగించారు. భావి భారత పౌరులకు ఉజ్వల భవిష్యత్తును అందించారు. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకంగా మారిన ఉపాధ్యాయుల కృషికి ప్రశంసలు వచ్చాయి. గురుపూజోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాలో 47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించనున్నారు. వీరిలో 14 మంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు చెందిన జూనియర్ కాలేజీ విభాగంలో ఒక్కరికి, పాఠశాల విభాగంలో ఇద్దరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వచ్చాయి. జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి అవార్డులు విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో అందుకోనున్నారు.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
పాఠశాల విభాగంలో కె.ఎస్ ఆదాం బాషా(ఎంఈఓ–2, సి.బెళగల్), షేక్ ఉస్మాన్ బాషా(జెడ్పీహెచ్‌ఎస్, టి.గోకులపాడు, కృష్ణగిరి మండలం), కె.వెంకటేశ్వర్లు(జెడ్పీ హైస్కూల్, పి.కోటకొండ, దేవనకొండ), పి.మనోరమ(ఎంపీపీఎస్(స్పెషల్)గూడురు), డి.సూర్యప్రకాష్ రెడ్డి(ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉర్దూ, కర్నూలు), జి.చిన్న బసవరాజు(ఎంపీపీఎస్, ఎస్సీ గాజులదిన్నె, గోనెగండ్ల), వి.సుబ్రమణ్య శర్మ(జెడ్పీహెచ్‌ఎస్, కౌతాళం), ఎస్.వి సౌభాగ్యరాణి(జెడ్పీహెచ్‌ఎస్, గుండ్లకొండ, దేవనకొండ), ఎం.నిరంజన్‌కుమార్(మున్సిపల్ హైస్కూల్, ఆదోని), ఎం.ఏ హలీం సిద్ధిఖి(మున్సిపల్ ఉర్దూ బాలిక హైస్కూల్, కర్నూలు), జి.జే సునీల్ రాజ్ కుమార్(ఎన్.ఎం.ఎం, హైస్కూల్, ఆదోని), కె.గోపాల్(జెడ్పీహెచ్‌ఎస్, కపటి, ఆదోని), పున్న లక్ష్మీ రంగన్న(జెడ్పీ హెచ్‌ఎస్, ముజఫర్ నగర్, కర్నూలు), ఎ.చంద్రమోహన్(ఎంపీపీఎస్, లక్ష్మీతాండ, తుగ్గలి), కె.పురుషోత్తం ఆచారి(జెడ్పీహెచ్‌ఎస్, కపటి, ఆదోని)కె.ఎం నాగేంద్రకుమార్(జెడ్పీహెచ్‌ఎస్, కనకవీడు,నందవరం), టి.వి.ఎల్ పద్మావతి(జెడ్పీహెచ్‌ఎస్, ముజఫర్ నగర్), బి.హసీనా(జెడ్పీహెచ్‌ఎస్, దొడ్డనగేరి, ఆదోని), వి.శ్రీనివాసులు(డా.బి.ఆర్ ఆంబేడ్కర్ గురుకులం ఆరికేర), యు.ఎస్ అయ్యప్ప(జెడ్పీహెచ్‌ఎస్, కౌతాళం), ఎం.మారుతి(పులికొండ), ఎం.బాలచంద్రుడు(డా.బి.ఆర్ ఆంబేద్కర్ గురుకులం ఆరికేర),ఎం.శోభాదేవి(ఎంపీపీఎస్, ఈర్నపాడు), కళ్యాణికుమారి(ఎంపీపీఎస్, జే.ఎం తాండ, పత్తికొండ), కె.అరుణజ్యోతి(ఎంపీపీఎస్ కన్నడ, బదినేహాల్),ఎం.రామ్మెహన్(ఎంపీపీఎస్, మాధవరం), డా.శ్రీదేవి(డీసీఓ, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్), యమున(డీసీఓ, మహత్మజ్యోతిరావుఫూలే స్కూల్స్), డి.దుర్ధానా ఫర్హీన్(ఎంపీపీఎస్, బీ.ఎస్, గోనెగండ్ల).
జూనియర్ కాలేజీ విభాగంలో..
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు 14 మందికి జిల్లా స్థాయి అవార్డులు ఇవ్వనున్నారు. కర్నూలు టౌన్ కాలేజీకి చెందిన అధ్యాపకులు జి.గీత(కెమిస్ట్రీ), వి.లావణ్య(హిస్టరీ), వి.నాగరాజు(బోటనీ), జి.ప్రమీలా(ఎకనామిక్స్), కెవిఆర్ కాలేజీకి చెందిన అధ్యాపకులు షేక్ రేష్మ(బోటనీ), షేక్ షాహీనా బేగం(ఫిజిక్స్),జి.శ్రీనివాసులు(జువాలజీ), కె.సువర్ణదేవి(హిస్టరీ), ఎస్.అఫ్రోజ్ సుల్తానా(కెమిస్ట్రీ), జే.వి రమణ గుప్తా(ఇంగ్లీషు), యు.మధుసూదన్(తెలుగు), ఆర్.సురేష్(హిస్టరీ, గోనెగండ్ల), ఈ.మల్లన్న(కామర్స్, మంత్రాలయం), కె.సుధీయేంధ్రకుమార్(మైనార్టీ కాలేజీ, కర్నూలు)లకు అవార్డులు వచ్చాయి.
రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికై న వారు..
పాఠశాల విభాగంలో పత్తికొండ మండలం హోసూరు ఎంపీపీఎస్(డబ్ల్యూ)లో పనిచేస్తున్న సెకండ్ గ్రేడ్ టీచర్ జి.వినూత, సి.బెళగల్ మండలం బురాన్‌దొడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు టీచర్ ముతూకురి గోపాల ఆచార్యులుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కౌతాళం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్‌గా పని చేస్తున్న ఎం.సంతోష్‌కుమార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ అవార్డు అందుకోనున్నారు.