
మద్యం అక్రమ విక్రయదారుడి అరెస్టు
స్థానిక బిర్లాగడ్డ దగ్గర అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్న బోయ వెంకటేశ్వర్లును గురువారం ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌కు అందిన సమాచారం మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 472 బాటిళ్లు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, 275 డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని విక్రయదారుడిని అరెస్టు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో డ్రై డే ప్రకటించినందున అక్రమ మద్యం అమ్మకాలు నిరోధించే లక్ష్యంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ జయరామ నాయుడు, ఎస్‌ఐలు రవితేజ, మారుతి ప్రసాద్ సిబ్బంది నిఘా పెట్టారు. ఈ క్రమంలో మద్యం అక్రమ విక్రయాలపై సమాచారం అందడటంతో బిర్లాగడ్డ దగ్గర ఉన్న బోయ వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేసి ఒక స్కూటీతో పాటు అట్టపెట్టెలు, ప్లాస్టిక్ సంచుల్లో దాచివుంచిన మద్యాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. అలాగే విక్రయదారుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కేసు నమోదు నిమిత్తం కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన మద్యం ఏ దుకాణం నుంచి సరఫరా అయిందనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మద్యం సరఫరా చేసిన దుకాణాన్ని వదిలేసి కేవలం విక్రయదారుడిపై మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ దాడుల్లో ఎస్‌ఐ రవితేజ, సిబ్బంది మధు, వెంకటరాముడు, రామాంజినేయులు, అల్లస్వామి, షేక్‌షావలి, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.