
సత్తా చాటిన వెంకటగిరి వృషభాలు
కృష్ణగిరి: పుట్లూరు గ్రామంలో శ్రీ మాతా మారెమ్మ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన అంతర్ రాష్ట్ర స్థాయి పాల పళ్ల ఎద్దుల బండలాగుడు పోటీల్లో కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ శ్రేషాంక్ శ్రేయ వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. రెండవ స్థానంలో నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మేకల బానుఖా, వెంకటగిరి శ్రేషాంక్ శ్రేయల కు చెందిన వృషభాలు ఉమ్మడిగా నిలిచాయి. మూడవ స్థానంలో ఉయ్యాలవాడ మండలం నర్సిపల్లెకు చెందిన ఉప్పరి లక్ష్మీదేవి, సంజామల మండలం ముక్క మల్ల గ్రామానికి చెందిన ముసాని చంద్రశేఖర్‌రెడ్డి వృషభాలు ఉమ్మడిగా నిలిచాయి. నాల్గవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడుకు చెందిన వడ్డేమాను అంజనేయరెడ్డి వృషభాలు, ఐదవస్థానంలో సీ. బెళగల్ మండలం యనకండ్లకు భద్ర విజయభాస్కర్ వృషభాలు గెలుపొందినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలి పారు. ఈ పోటీల్లో 11 జతల ఎద్దులు పాల్గొనట్లు తెలిపారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు దాతలు సహకారంతో వరుసగా రూ. 25 వేలు, రూ. 20వేలు, రూ. 15 వేలు, రూ. 12వేలు, రూ.10వేలు అందజేశారు.
నేడు న్యూ కేటగిరీ విభాగంలో..
బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం న్యూ కేటగిరి విభాగంలో అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలు ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో గెలు పొందిన వాటికి వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలను దాతల సహకారంతో అందిస్తున్నట్లు వారు తెలిపారు.

సత్తా చాటిన వెంకటగిరి వృషభాలు