
దైవదర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
● ఆటో బోల్తా పడి మహిళ దుర్మరణం ● మరో ముగ్గురికి గాయాలు
మద్దికెర: దైవదర్శనానికి వెళ్తున్న ఓ మహిళ ఆటో బోల్తా పడిన ఘటనలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మద్దికెరకు చెందిన లలితమ్మ(55)తోపాటు పలువురు అరుణాచలం దేవస్థానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మంగళవారం మద్దికెర నుంచి గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు రెండు ఆటోల్లో బయలుదేరారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మహిళలు గాయపడడంతో చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. లలితమ్మ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

దైవదర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..