
ఆయుష్‌లో కాంపౌండర్లే డాక్టర్లు!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆయుష్ విభాగంలో ఉన్న ఆయుర్వేదిక్, హోమియో డిస్పెన్సరీలలో వైద్యుల కొరత వేధిస్తోంది. కొన్ని నెలలుగా ఆయుర్వేదంలో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే హోమియో విభాగంలోనూ మెడికల్ ఆఫీసర్ మెడికల్ లీవ్ పెట్టారు. ఈ కారణంగా రెండు విభాగాల్లో వైద్యులు లేకపోవడంతో రోగులు వచ్చి వెనుదిరిగి పోతున్నారు. కొంతమందికి అక్కడ ఉన్న కాంపౌండర్లే పాత వ్యాధిగ్రస్తులతో పాటు కొత్త వ్యాధిగ్రస్తులకు వ్యాధి లక్షణాలను బట్టి మందులు ఇచ్చి పంపుతున్నారు. ఈ రెండు విభాగాల్లో గతంలో ప్రతిరోజూ 60 నుంచి 80 మంది దాకా చికిత్స కోసం వచ్చేవారు. వైద్యులు లేకపోవడంతో ప్రస్తు తం వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఆయుష్ విభాగం పట్ల కూటమి ప్రభుత్వం ఎంతగా శ్రద్ధ చూపిస్తుందో అర్థమవుతోంది.
– కర్నూలు(హాస్పిటల్)