
బడికి తాళం.. చర్చిలో పాఠం
కోసిగి: సాతనూరు కొట్టాల గ్రామ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడటంతో విద్యార్థుల క్షేమం దృష్ట్యా బడిని చర్చిలోకి మార్చారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిన విషయం అందిరికీ తెలిసిందే. సోమ వారం ఉదయం పాఠ శాలకు చేరుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయుడు అరుణ్‌కుమార్ గదిలో పడిన సిమెంట్ పెచ్చులు చూసి భయాందోళన చెందారు. పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు ఒకే గది ఉండడంతో హెచ్‌ఎం పాఠశాలకు తాళం వేసి గ్రామస్తుల సహకారంతో పక్కనే ఉన్న చర్చి ప్రాంగణంలో పాఠాలు బోధించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ–2 శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని పాఠశాల పరిస్థితిని సమీక్షించారు. చాలా కాలం క్రితం నిర్మించిన పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిందని గుర్తించారు. ఇకపై పాఠశాలలో తరగతులు నిర్వహించొద్దని హెచ్‌ఎంకు సూచించారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు రెండవ విడత కింద పాఠశాల ఎంపికై ందని, అయితే ఎన్నికల కోడ్ రావడంతో పనులు మొదలు పెట్టలేకపోయామని ఏఈ రంగరాజు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

బడికి తాళం.. చర్చిలో పాఠం