
సమస్యలు తలెత్తితే నేరుగా కలవండి
● పదవీ విరమణ ఉద్యోగులకు
ఎస్పీ హామీ
కర్నూలు: పదవీ విరమణ అనంతరం రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా తలెత్తితే తనను నేరుగా కలవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. కర్నూలు పీసీఆర్ ఎస్‌ఐ నిర్మలాదేవి, ఏఆర్‌ఎస్‌ఐ పురుషోత్తం తదితరులు పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ విక్రాంత్ పాటిల్ శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి వీడ్కోలు పలికారు. శేష జీవితం కుటుంబాలతో సంతోషంగా గడపాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, ఎస్‌బీ సీఐ కేశవరెడ్డి, ఆర్‌ఐ నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.