
పౌష్టికాహారం ఇవ్వడం లేదు
● ఎంపీడీఓ కార్యాలయం
వద్ద బాలింత నిరసన
గోనెగండ్ల: తాను బాలింతను అయినా అంగన్‌వాడీ టీచర్ పౌష్టికాహారం ఇవ్వడం లేదని చిన్నమరివీడు గ్రామానికి చెందిన బండారి తేజ, ఆమె తల్లిదండ్రులు సుశాంతి, బతకన్నలు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. బాలింత తేజ 23 రోజుల చిన్నారిని ఎత్తుకొని తల్లిదండ్రులతో కలిసి సోమవారం ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎంపీడీఓ మణి మంజరికి తమ సమస్యను వివరించారు. తాను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి అంగన్‌వాడీ సెంటర్ నుంచి పౌష్టికాహారం అందడం లేదని ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడీ వర్కర్ దురుసుగా మాట్లాడుతున్నారని, తనకు ప్రసవం జరిగి 23 రోజులు అయిన తరువాత కూడా పౌష్టికాహారం ఇవ్వడం లేదన్నారు. తన తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పోషిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు.