అట్టహాసంగా ‘పట్టా’భిషేకం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

Jul 21 2025 8:11 AM | Updated on Jul 21 2025 8:11 AM

అట్టహ

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై వెలసిన ఐఐఐటీడీఎం (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌)లో ఏడో స్నాతకోత్సవాన్ని ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. బీటెక్‌ పట్టాలు అందుకున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులతో సంతోషంగా గడిపారు. స్నేహితులతో సెల్ఫీలు తీసుకొని ముచ్చటించారు. బీటెక్‌ పట్టాలను చూసి మురిసిపోయారు. జీవితంలో అనుకున్నది సాధించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌, ఐఐఐటీడీఎం బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్‌ విజయలక్ష్మీ దేశ్‌మానే, ఐఐఐటీడీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌మూర్తి, రిజిస్ట్రార్‌ కె.గురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రాడ్యుయేట్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఐఐఐటీడీఎంలో 2024–25లో మొత్తం 178 మంది విద్యాభ్యాసం పూర్తి చేశారు. వీరిలో నలుగురు పీహెచ్‌డీ, ఎంటెక్‌ సీఎస్‌లో 20మంది, బీటెక్‌ సీఎస్‌లో 69 మంది, బీటెక్‌ ఏఐఅండ్‌డీఏలో 50 మంది, బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌లో 39 మంది, బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 21మంది ఉన్నారు.

గోల్డ్‌ మెడలిస్టులు వీరే...

2024–25 విద్యాసంవత్సరానికి కర్నూలు ఐఐఐటీడీఎంలో మొత్తం ఏడుగురు గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ఎంటెక్‌ విభాగంలో అర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ విభాగంలో టాపర్‌గా ప్రణయ్‌ సందీప్‌ పరివార్‌ నిలిచారు. బీటీఎస్‌ సీఎస్‌ఈలో లవీస్‌సింగ్‌, బీటెక్‌ ఏఐఅండ్‌ డీఏలో గుమ్మశ్రీ సౌగాంధిక, బీటెక్‌ ఈసీఈలో చెముడుపాటి వెంకట శ్రీవర్ధన్‌ మూర్తి, బీటెక్‌ ఎంఈలో ప్రతీబి టాపర్లుగా నిలిచి గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్నారు.అన్ని బీటెక్‌ గ్రూపులకు కలసి టాపర్‌గా లవీసింగ్‌ నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. దురువాసల మాణిక్యాంబకు ఎండోమెంట్‌ గోల్డ్‌ మెడల్‌ లభించింది.

సువర్ణావకాశం...

2024–25 విద్యాసంవత్సరంలో కర్నూలు ఐఐఐటీడీఎంలో బీటెక్‌ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం లభించింది. గతేడాది క్యాంపస్‌ ఇంటర్వ్యూ లేక విద్యార్థులు అల్లాడిపోయారు. డిగ్రీ పూర్తి చేసుకున్నా ఉద్యోగాలు లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. ఈ యేడాది క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరిగి దాదాపు 50 మందికిపైగానే ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో ఓ విద్యార్థికి ఏడాదికి రూ. 38 లక్షల ఉద్యోగం ఇన్ఫోసిస్‌లో లభించినట్లు తెలుస్తోంది. అంతేకాక క్యాంపస్‌ బయటకు వెళ్లిన విద్యార్థుల్లో కూడా చాలా మంది ఉద్యోగాలు సాధించారు.

ట్రిపుల్‌ఐటీ డీఎంలో స్నాతకోత్సవం

మొత్తం 178 మందికి డిగ్రీల ప్రదానం

టాపర్లకు పట్టాలను అందజేసిన

ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం1
1/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం2
2/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం3
3/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం4
4/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం5
5/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం6
6/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం7
7/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం8
8/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం9
9/9

అట్టహాసంగా ‘పట్టా’భిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement