గతంలో ఎప్పుడూ
ఇలాంటి పరిస్థితి రాలేదు
ఈ ఏడాది నేను 7వేలకుపైగానే మొక్కలను సిద్ధంగా ఉంచాను. ఇందుకు రూ. 5లక్షలకు పైగానే పెట్టుబడి వచ్చింది. వర్షాలు సరిగ్గా లేక మొక్కలు డిపోల్లోనే ఉండిపోయాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎంతో జాగ్రత్తగా తల్లి అంటు ద్వారా అప్రోచ్ గ్రాప్టింగ్ మొక్కలు ఇక్కడ తప్ప ఎక్కడా దొరకవు. ప్రతి ఏడాది ఈ నెలలో సగానికిపైగా మొక్కలను అమ్ముకునే వాళ్లం, కాని ఇప్పటికీ 5 శాతం కూడా మొక్కలు అమ్మలేదు.
– జనపాల పెద్దన్న, నర్సరీ యజమాని
ఉపాధి పథకానికి
అనుసంధానం చేయాలి
ప్రతి సంవత్సరం మామిడి మొక్కలు జూన్‌లో విక్రయా లు ప్రారంభమయ్యేవి. జూలై నాటికి నర్సరీల్లో మొక్కలు సగానికపైగా అమ్ముడుబోయేవి. కాని ఈ ఏడాది మొక్కలు అమ్ముడుబోక నర్సరీల్లో ఉండిపోయాయి. ఉపాధి హామీ పథకానికి నర్సరీలో అనుసంధానం చేయాలి. మా నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మామిడి సాగు చేసే రైతులకు పాణ్యం నర్పరీలో మొక్కలను సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇంతటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. – రాము, నర్సరీ యజమాని
పాణ్యం: ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎవరూ మామిడి మొక్కలు కొనడం లేదు. దీంతో పాణ్యంలోని మామిడి నర్సరీలు వెలవెలబోతున్నాయి. ఇక్కడ 40కుపైగా నర్సరీల్లో మామిడి మొక్కలను సాగు చేస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలో నర్సరీలు రైతులతో కిటకిటలాడుతుంటాయి. అలాంటి ప్రసిద్ధి చెందిన నర్సరీలు నేడు వెలవెలబోతున్నాయి.
రెండు లక్షల మొక్కలకు పైగానే..
మామిడి (మధుర ఫలం) మొక్కలకు ప్రసిద్ధి పాణ్యం నర్సరీలు. ఇక్కడ తల్లి అంటు (అప్రోచ్ గ్రాప్టింగ్) నుంచి మొక్కలు తయారు చేస్తారు. ఇలా ఈ ఏడాది దాదాపుగా రెండు లక్షల మొక్కలకు పైగానే నర్సరీల్లో తయారు చేశారు. లక్షల పెట్టుబడులు పెట్టి మొక్కలను సాగు చేస్తే కొనేందుకు ఎవరూ రాకపోవడంతో ఏమి చేయాలో రైతులకు అర్థం కావడం లేదు. ఈ నర్సరీల్లో మామిడి రకంలోనే దాదాపుగా 40 రకాలకు పైగా ఉన్నాయని నర్సరీల రైతులు చెబుతున్నారు. అత్యధికంగా బేసిషన్, అమృతం, రెడ్డి పసంద్‌ను రైతులు ఇష్టపడతారు. ఈ ఏడాది దాదాపుగా 2లక్షల పైగానే మొక్కలు సిద్ధం చేసినప్పటికీ రైతులు రాక డిపోల్లో ఉంచారు.
వర్షాలు లేక..
సాధారణంగా మామిడి సాగు చేసుకునే రైతులు మార్చి, ఏప్రిల్ నెలలో నర్సరీలకు వస్తారు. అంటు తీరును పరిశీలించి తమకు కావాలని వెళ్తారు. తీరా వర్షాలు పడ్డాక జూన్ నెలలో మొదలు కొని జూలై, ఆగస్టు వరకు తీసుకెళ్తారు. అయితే వరుణదేవుడు కరుణించకపోవడంతో రైతులు మామిడి సాగుపై ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది ఆశించిన వర్షాలు లేనందుకు విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పెంచి మొక్కల నిర్వహణ భారం మరింత పెరుగుతోందని రైతులు చెబుతున్నారు. పాణ్యం నర్సరీల నుంచి అధికంగా కర్ణాటక, హైదరాబాద్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు.
రాయితీలు కరువు
నర్సరీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు లైసెన్సులు అందించారు. అంతేగాక మా మిడి సాగు చేసే రైతులకు ఉపాధి సిబ్బంది పాణ్యంలో నర్సరీల్లో మొక్కలను సూచించే వారు. కాని కూటమి ప్రభుత్వంలో నర్సరీలకు రాయితీలు ఇవ్వకపోగా మామిడి సాగు చేసే రైతులకు టెండర్ల ద్వారా ఇతర జిల్లాల నుంచి మొక్కలను సరఫరా చేస్తున్నారు. దీంతో పాణ్యం నర్సరీలు తీవ్రంగా నస్టపోతున్నాయి.
విక్రయాలు లేక వెలవెలబోతున్న
మామిడి నర్సరీలు
ఊపందుకోని మొక్కల విక్రయాలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి
రాయితీలు కరువు
వర్షించని ‘మధుర’ ఆశలు!
వర్షించని ‘మధుర’ ఆశలు!
వర్షించని ‘మధుర’ ఆశలు!