ప్రభుత్వ క్వార్టర్లపై కూటమి నేతల కన్ను | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ క్వార్టర్లపై కూటమి నేతల కన్ను

Jul 15 2025 12:00 PM | Updated on Jul 15 2025 12:00 PM

ప్రభు

ప్రభుత్వ క్వార్టర్లపై కూటమి నేతల కన్ను

రాజధానిగా ఉన్నపుడు

ఏ, బీ, సీ క్యాంపుల్లో క్వార్టర్లు నిర్మాణం

స్టేడియం నిర్మాణం పేరిట

39 క్వార్టర్ల కూల్చివేతకు నోటీసులు

లీజు పేరుతో స్థలాన్ని కాజేసేందుకు

ప్రజాప్రతినిధుల కుట్ర

బీ, సీ క్యాంపులో సెంటు స్థలం

రూ.25లక్షల నుంచి

రూ.30లక్షల పైనే

ఈ లెక్కన 1,090 క్వార్టర్ల విలువ

రూ.వేల కోట్లు

మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యే చరిత

దంపతుల కనుసన్నల్లో కూల్చివేతలు

2 ఎకరాల్లో టీడీపీ కార్యాలయ

నిర్మాణానికి కలెక్టర్‌కు టీడీపీ లేఖ

ఈ స్థలం విలువ రూ.120కోట్లు

ఇదో భారీ ‘గూడు’ పుఠాణి. కర్నూలు నడిబొడ్డున వేలకోట్ల విలువైన వందల ఎకరాల స్థలాన్ని అభివృద్ధి ముసుగులో కొన్ని నిర్మాణాలు చేపట్టి తక్కిన స్థలాన్ని లీజు పేరుతో ఆక్రమించేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తొలి పావు కదిలింది. మినీ క్రికెట్‌ స్టేడియం పేరుతో 1,090 క్వార్టర్లలో 39 క్వార్టర్ల కూల్చివేతకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తక్కిన వాటిని కూల్చనున్నారు. ఈ స్థలంలో కొంత ప్రభుత్వ అవసరాలకు వినియోగించి, ఆ ముసుగులో లీజు పేరుతో టీడీపీ నేతలు, ప్రధాన అనచరులు మిగిలిన స్థలం పాగా వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరవాసులు, విపక్ష పార్టీలు మేల్కొనకపోతే విలువైన స్థలం లీజు పేరిట నేతల వశం కానుంది. – సాక్షి ప్రతినిధి కర్నూలు

సీ క్యాంప్‌లో

విలువైన స్థలం

మిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. 1953 అక్టోబర్‌ 1 నుంచి 1956 అక్టోబర్‌ 31 వరకూ కర్నూలే రాజధాని. అప్పట్లో అధికారులు నివాసం ఉండేందుకు ఏ, బీ, సీ క్వార్టర్లను ప్రభుత్వం నిర్మించింది. బి, సి క్యాంపు పరిధిలో 1,090 ప్రభుత్వ నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ రెండూ కర్నూలుతో పాటు పాణ్యం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. వీటిలో సింహభాగం ఉద్యోగులు కాకుండా ఇతరులు అక్రమంగా నివాసం ఉంటున్నారు. సిటీ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కిందటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని.. అపార్ట్‌మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించారు. వైఎస్‌ మృతితో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు.

సర్కారు స్థలంపై ఇద్దరు నేతల కన్ను

బీ, సీ క్యాంపులోని క్వార్టర్లపై మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యే గౌరు చరిత వర్గీయులు కన్నేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పేరుతో 1,090 క్వార్టర్లను తొలగించి ఇక్కడ మినీ క్రికెట్‌ స్టేడియం నిర్మించాలని భరత్‌ భావించినట్లు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు కాజేసే కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో 33 ఏళ్లు లీజుకు తీసుకుని అందులో మల్లీప్లెక్స్‌, స్టార్‌ హోటల్స్‌, ఫంక్షన్‌హాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలుత 39 క్వార్టర్ల కూల్చివేతకు ఆర్‌అండ్‌బీ అధికారులు భవనాల్లో నివాసం ఉంటున్నవారికి నోటీసులు ఇచ్చారు. ఈ స్థలం పాణ్యం నియోజకవర్గ పరిధిలోకి కూడా రావడంతో తమకు తెలీకుండా ప్రతిపాదనలు రూపొందించడం, లీజు పేరుతో స్థలాలు కాజేస్తున్నట్లు తెలియడంతో ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలివిడతలో 39 క్వార్టర్లు తొలగించిన స్థలంలో స్టేడియం నిర్మాణం పోనూ, మరింత స్థలం మిగులుతుందని, మొత్తం 1090 క్వార్టర్లు తొలగిస్తే వందల ఎకరాల స్థలం ఉంటుందని భావించారు. దీంతో వారు కూడా లీజు పేరుతో స్థలం తీసుకోవాలని భావించినట్లు సమాచారం.

రూ. వేలకోట్ల విలువైన స్థలం

కాజేసేందుకు కుట్ర

బీ, సీ క్యాంపు పరిధిలోని 1,090 క్వార్టర్లు, ఖాళీ ప్రదేశాలు మొత్తం ప్రభుత్వ ఆస్తులే. ఇందులో ఈ స్థలాల ను ఆక్రమించి కొందరు ప్రైవేటు నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక్కడ సెంటు స్థలం రూ.25లక్షల నుంచి 30లక్షల వరకూ ఉంది. కొన్ని చోట్ల రూ.50లక్షలు కూడా పలుకుతోంది. ఈ లెక్కన మొత్తం భవనాలు తొలగిస్తే ఆ ప్రదేశం కర్నూలు సిటీలో అత్యంత విలువైన స్థలం అవుతుంది. అప్పడు దీని విలువ వేల కోట్లు ఉంటుంది. ఓ పథకం ప్రకారం అభివృద్ధి పేరు తో తొలివిడతలో ఓ మినీ క్రికెట్‌ స్టేడియం, మలి విడతలో ఇంకొన్ని నిర్మాణాలు ప్రజాప్రతినిధులు చేపడతారు. అయినప్పటికీ భారీగా స్థలం మిగిలే ఉంటుంది. ఈ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేయాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలోని కొందరు బడానేతలు లీజు పేరుతో ప్రభుత్వ స్థలాలను తీసుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టి లీజు ముగిసినా రాజకీయ, ఆర్థిక బలంతో లీజు పొడిగిస్తూ ఆర్థికంగా ఎలా అర్జిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు బీ, సీ క్యాంపు నిర్మాణాలపై కూడా టీడీ పీ నేతలు కన్నేశారు. ఈ క్వార్టర్లు కూల్చేసి నిర్మాణా లు చేపడితే కర్నూలులోనే అత్యంత విలువైన ప్రాంతంగా మారుతుంది. ఇలాంటి స్థలాన్ని లీజు పేరుతో చిల్లర ప్రభుత్వ ఖజానాకు విదిల్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు టీడీపీ నేతలు పథకం రచించారు.

ప్రభుత్వ క్వార్టర్లపై  కూటమి నేతల కన్ను 
1
1/1

ప్రభుత్వ క్వార్టర్లపై కూటమి నేతల కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement