
పాఠశాలల్లో మరుగుదొడ్ల వివరాలు పంపాలి
ఎమ్మిగనూరుటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జెడ్పీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా అవరం కానున్న మరుగుదొడ్ల వివరాలు పంపాలని పాఠశాల విద్య కమిషనర్ నుంచి సోమవారం ఎంఈఓలకు ఆదేశాలు వచ్చాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ బాలికల జెడ్పీ పాఠశాలలో 3,630 మంది విద్యార్థినులు మరుగుదొడ్లు లేక పడుతున్న అవస్థలపై సాక్షిలో ‘ఆ అవసరానికీ అవస్థే...!’ అని ఈనెల 8న ప్రచురితమైన వార్తకు పాఠశాల విద్య కమిషనర్ స్పందించారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్ల వివరాలు సత్వరం పంపాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎంఈఓలు సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు మరుగుదొడ్ల జాబితాలు తయారు చేస్తున్నారు.
పాఠశాల విద్య కమిషనర్