
రూ.120కోట్ల విలువైన స్థలంలో టీడీపీ కార్యాలయం
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి 2 ఎకరాలను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కలెక్టర్ రంజిత్‌బాషాకు లేఖకు రాశారు. బీక్యాంపు మెయిన్‌రోడ్డులోని స్థలం టీడీపీ కోరింది. ఇక్కడ సెంటు రూ.60లక్షలు ఉంది. ఈ లెక్కన 2 ఎకరాల విలువ రూ.120కోట్లు పైనే. కొన్ని పార్టీలు 33 ఏళ్లకు ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకుంటే టీడీపీ నేతలు నానా యాగీ చేశారు. ఇప్పుడు టీడీపీ ఆఫీసుకు విలువైన స్థలాన్ని 99 ఏళ్లపాటు లీజు కోసం కలెక్టర్‌కు లేఖ రాశారు. టీడీపీ ఆఫీసు ప్రతిపాదన తర్వాతే ఈ స్థలంలోని క్వార్టర్లను కూల్చేసి అభివృద్ధి కార్యాక్రమాల పేరుతో కొన్ని నిర్మాణాలు చేపట్టి స్థలాలను లీజుకు తీసుకోవచ్చనే ఆలోచన కూటమి నేతలు చేసినట్లు తెలుస్తోంది.