
బీఎల్‌ఓల శిక్షణ ప్రారంభం
కల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గ ఈఆర్‌ఓ (ఎన్నికల రిటర్నింగ్ అధికారి) జాయింట్ కలెక్టర్ నవ్య మంగళవారం కల్లూరు మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనంలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓల) శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బీఎల్‌ఓల విధుల గురించి వివరించారు. వారికి అసెస్‌మెంట్ పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ మంజూరు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ నాగశేషాచలరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.