
కేఎంసీ, ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలు మెడికల్ కాలేజీలోని వివిధ ఖాళీల పోస్టుల భర్తీకి ఒప్పందం/అవు ట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేసేందుకు కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దర ఖాస్తు ఫారం, ఇతర వివరాలు కర్నూలు, నంద్యాల జిల్లాల వెబ్‌సైట్ https://kurnool. ap.gov.in, https://nandyal.ap.gov.in లో ఉంచినట్లు తెలిపారు. ఆసక్తిగల వారు పై వెబ్‌సైట్‌ల నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తులను కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని సూచించారు.
విద్యార్థిపై వీధి కుక్కల దాడి
బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో స్కూలుకు వెళ్తున్న విద్యార్థి నీతీష్ కుమార్‌పై వీధి కుక్కలు దాడి చేసి గా యపరిచాయి. స్థానికు లు స్పందించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో గాయపడిన విద్యార్థిని గ్రామంలోని వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, వాటిని గ్రామం నుంచి దూరంగా తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈగల్ టీమ్ ఐజీ నేడు కర్నూలు రాక
కర్నూలు: ఈగల్ టీమ్ ఐజీ ఆకె రవికృష్ణ కర్నూ లు పర్యటనకు వస్తున్నారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఉదయం 10:45 గంటలకు అవగా హన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆకె రవికృష్ణతో పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
కులం పేరుతో ధూషించి కత్తితో దాడి
ప్యాపిలి: మండల పరిధిలోని వెంగళాంపల్లిలో సోమవారం పీర్లు జలధికి వెళ్లే సందర్భంలో ఘర్షణ చోటు చేసుకుంది. గుండం వద్ద బండి రాజేశ్ అనే వ్యక్తి నిల్చుని ఉండగా అదే గ్రామానికి చెందిన సాయిచరణ్ చిందులు తొక్కుతూ రాజేశ్ కాలిపై తొక్కాడు. అక్కడున్న మనోజ్ అతన్ని వారించగా కులం పేరుతో ధూషించాడు. కొద్దిసేపటి తర్వాత సాయిచరణ్, ధనుంజయ, రామాంజనేయులు, రమేశ్ తదితరులు రాజేశ్‌పై కత్తితో దాడి చేశారు. వారిని ఆపే ప్రయత్నం చేసిన మహేశ్‌ను కూడా కత్తితో పొడిచారు. కులం పేరుతో తమను ధూషించడంతో పాటు కత్తులతో దాడికి పాల్పడినట్లు బాధితుల సోదరుడు మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
కోవెలకుంట్ల: మండలంలోని సౌదరదిన్నెకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన సూర్యచంద్రుడు (36) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ కోవెలకుంట్ల, కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన తర్వాత గమనించి ఆయన్ను చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య భారతి, కుమార్తె చంద్రావతి, కుమారుడు గురుచరణ్ ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.