
కనుల పండువగా ‘తొలి’ వేడుక
జిల్లాలో తొలిఏకాదశి (ఆషాఢశుద్ధ ఏకాదశి) వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదోనిలో రుక్మిణి , పాండురంగస్వాముల విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన గురజాల రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు శ్రీవేద నారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులోని గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. జిల్లాలో పలుచోట్ల భజన కార్యక్రమాలు నిర్వహించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు