
శాస్త్రోక్తంగా తొలి ఏకాదశి పూజలు
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజ లు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదే వి సమేత ప్రహ్లాదవరద స్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి మంగళవాయిద్యాల మధ్య దూపదీపాలతో మహా మంగళహారతి అందించారు. రాత్రి విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు పల్లకీలో కొలువుదీరి తిరువీధిలో విహరించారు.