
విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి
కర్నూలు(అర్బన్): విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు ఏర్పడతాయని పలువురు బ్రాహ్మణ నేతలు, అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక సంకల్‌బాగ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల కోర్టు జడ్జి కే కిషోర్‌కుమార్, అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి డా.వేణుగోపాల్, కే రంగనాథశర్మ, కేవీ సుబ్బారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రాహ్మణ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 4 వేలు నగదు, జ్ఞాపికతో పాటు శాలువా కప్పి సన్మానించా రు. సంఘం గౌరవాధ్యక్షులు చెరువు దుర్గాప్రసాద్, కార్యదర్శి చల్లా నాగరాజశర్మ, ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యాంసుందర్, కోశాధికారి సీఎస్ ప్రసాదరావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్, సలహాదారు రవిచంద్రశర్మ, నాయకులు మామిళ్లపల్లి రాజేష్, నాగేశ్వరరావు, శ్రీనివాసరాజు, ఫణి తదితరులు హాజరయ్యారు.