
ముగిసిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల పట్టణంలోని నందిపైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి షటిల్ బాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు నందిగ్రూప్ ఆఫ్ అధినేత సుజల బహుమతులు అందజేశారు. ఉమ్మడి జిల్లా నుంచి 300 మందికి పైగా బాల,బాలికలు పాల్గొన్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యాక్షులు వంశీధర్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆగస్టులో 5వ తేదీ నుంచి విశాఖపట్నంలో అండర్ –19 పోటీలు, ఆగస్టులో 21 నుంచి నెల్లూరులో అండర్ –15 పోటీలు, అక్టోబర్ 1 నుంచి నుంచి అనంతపురంలో అండర్ –17 పోటీలు, అక్టోబర్ 23 నుంచి ఒంగోలులో అండర్ –13 పోటీలు, నవంబర్ 1 నుంచి కడపలో అండర్ –11 పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అసోయేషన్ సభ్యులు శేషిరెడ్డి, సంజీవరెడ్డి, డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, కోచ్‌లు నాగార్జున, చైతన్య తదితరులు పాల్గొన్నారు.