
రోడ్లన్నీ జలమయం
కోసిగి: మండలంలో శుక్రవారం సాయంత్రం ఒక గంట పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోసిగిలోని పంచాయతీ కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ముందు భాగంలోని ప్రధాన రోడ్డులో, ఆర్టీసీ బస్టాండ్‌లో వర్షపు నీరు నిల్వ ఉండి రాకపోకలకు ఇబ్బండి పడ్డారు. అలాగే రైల్వే గేటు సమీపంలోని ఉరుకుంద ఆర్చ్ వద్ద ఉత్తుత్తి వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోసిగి ప్రధాన రోడ్డులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరారు.