
పౌరాణికాలకు ఆదరణ తగ్గలేదు
కర్నూలు(హాస్పిటల్): ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గలేదని పారిశ్రామిక వేత్త, సినీనటులు బీవీ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో స్వేచ్ఛ నాటక ప్రదర్శనలో భాగంగా శ్రీకృష్ణ రాయబారంలోని ఒక సన్నివేశం ప్రదర్శన జరిగింది. సభ ప్రారంభంలో శ్రీకృష్ణ రాయబారంలోని పడక సీను సన్నివేశాన్ని శ్రీకృష్ణునిగా భాస్కరయాదవ్, అర్జునుడిగా కేవీ రమణ, దుర్యోధనుడిగా చల్ల నవీన్‌కుమార్ నటించారు. ఈ సందర్భంగా బీవీ రెడ్డి మాట్లాడుతూ తన చిన్నతనంలో రాత్రి 10 గంటలకు నాటకం ప్రారంభమైతే ఉద యం 6 గంటల వరకు కొనసాగేవన్నారు. ఎన్‌టీ రామారావుతో పాటు ఎందరో సినీనటులతో తనకు పరిచయం ఉందని, సినిమాలకు ఆదరణ క్రమేపీ తగ్గడం విచారకరమన్నారు. రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ కొత్తతరం నటులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తిఓబులయ్య, బలగం సినిమా ఫేమ్ సురభి లలిత మంజు గోవర్దన్‌రెడ్డి, కళాకారులు బీవీ రెడ్డి, బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, దస్తగిరి, పి.రాజారత్నం, మహమ్మద్‌మియ్య పాల్గొన్నారు.