
సరిహద్దు చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత
మంత్రాలయం/ఎమ్మిగనూరురూరల్: మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఎకై ్సజ్ అధికారులు రూ.39 లక్షల నగదును పట్టుకున్నారు. రాయచూరు నుంచి బళ్లారి వెళ్లే కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఆదోనిలోని విక్టోరియా పేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.39 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి బిల్లులు లభ్యం కాకపోవడంతో నగదును కర్నూలు ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు ఎకై ్సజ్ సీఐ రమేష్‌రెడ్డి, చెక్‌పోస్ట్ సీఐ రాయుడు తెలిపారు.
ఏఎన్‌ఎంల జాబితాపై
గందరగోళం
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలకు బదిలీలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల్లో అన్ని కేటగిరిలకు బదిలీలను ర్యాంకు ఆధారంగా చేస్తుండగా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్‌ను ఎలా తీసుకుంటారని దాదాపు 30 మందికి పైగా ఏఎన్‌ఎంలు శనివారం వారి అభ్యంతరాలను కార్యాలయ అధికారులకు అందజేశారు. తాజా జాబితాలోనూ ర్యాంకు ఎక్కువగా ఉన్న వారు పై భాగాన ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏఎన్‌ఎంలకు 2019 అక్టోబర్ 2న జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని, ఆ రోజున గాంధీ జయంతి ఉండటం వల్ల సెలవు అని, ఆ తేదీని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు విడుదల చేసిన జాబితాలోనూ పలు తప్పులు ఉన్నాయని, అధికారులు వీటిని సరిచేసి ర్యాంకు ఆధారంగా జాబితా తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.
చిన్నారిపై కుక్కదాడి
కొత్తపల్లి: ఇంటి బయట ఉన్న 9 నెలల చిన్నారి పై కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన ముసలిమడుగు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు, చిన్నారి దంపతులు తమ తొమ్మిది నెలల కూతురిని ఇంటి బయట ఉన్న అరుగు వద్ద కూర్చోబెట్టి తల్లి ఇంట్లోకి వెళ్లిది. అంతలోనే ఓ కుక్క చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. చెవికి, ముక్కుకు రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.
పీఏసీఎస్‌లకు
త్రీమెన్ కమిటీలు
కర్నూలు(అగ్రికల్చర్):ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యుల నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జీ కమిటీలను ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు తమ పరిధిలోని పీఏసీఎస్‌లకు త్రీమెన్ కమిటీలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి జాబితాలు అందజేశారు. త్రీమెన్ కమిటీలో ఒకరు చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజక ఇన్‌చార్జీలు ఇచ్చిన జాబితాలను సహకార శాఖకు పంపింది. ఇందులో భాగంగా సహకార శాఖ కమిషనర్ ఆయా జిల్లాల సహకార అధికారులకు జాబితాలను పంపారు. కర్నూలు జిల్లాలో 43 పీఏసీఎస్‌లు ఉండగా 28 పీఏసీఎస్‌లు.. నంద్యాల జిల్లాలో 56 పీఏసీఎస్‌లు ఉండగా 28 సంఘాలకు త్రీమెన్ కమిటీల నియామకానికి వెరిఫికేషన్‌కు సహకార శాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు డీసీవోలు చర్యలు చేపట్టారు.

సరిహద్దు చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత