
అమ్మానాన్న కోసం..
● ముంబై నుంచి ఆదోనికి వచ్చిన
యువకుడు
ఆదోని సెంట్రల్: ఎప్పుడో నాలుగేళ్ల వయస్సులో తప్పిన పోయి.. ఇప్పుడు 32 ఏళ్ల వయస్సుల్లో అమ్మానాన్నలను చూసేందుకు ముంబై నుంచి ఒక యువకుడు ఆదోనికి వచ్చాడు. సోమవారం సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్‌ను కలిసి తన తల్లిదండ్రుల వివరాలు చెప్పి, వారి దగ్గరికి తనను చేర్చాలని కోరారు. వివరాలు.. ఆదోనికి చెందిన వీరేష్ నాలుగేళ్ల వయస్సులో ఆడుకుంటూ ఆదోని రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడ రైలులో కూర్చొని తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ రెండేళ్లు అనాథ బాలల కేంద్రంలో ఉన్నాడు. అక్కడి నుంచి ముంబై చేరుకుని వెయిటర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. 32 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తన గ్రామం ఆదోని అని తెలసుకుని తల్లిదండ్రులను చూసేందుకు ఆదోనికి చేరుకున్నాడు. ఆదోని పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో ఉన్నట్లు, తన తండ్రి జనార్దన్, తన అమ్మమ్మ అంజనమ్మగా చెబుతున్నాడు. వీరేష్‌కు తెలుగు రాదు మరాఠీలో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆదోనికి వచ్చిన యువకుడికి తల్లిదండ్రులను చూపించాలని పురపాలక సిబ్బందిని సబ్‌కలెక్టర్ ఆదేశించారు.