
వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో
వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు ముస్లింలు వేలాదిగా తరలివచ్చారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింలకు చంద్రబాబు మోసం చేశారన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీని, జనసేన పార్టీలను ఘోరంగా ఓడించాలన్నారు. – కర్నూలు టౌన్