
విద్యార్థిని చితకబాదిన పీడీ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా, మల్లికార్జునస్వామి వార్లను సినీ హీరో మంచు విష్ణు బుధవారం దర్శించుకున్నారు. రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంచు విష్ణు మల్లికార్జున స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడంతో 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయ్యిందని చెప్పారు. తాను నటించిన కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు.

విద్యార్థిని చితకబాదిన పీడీ

విద్యార్థిని చితకబాదిన పీడీ