
కూటమి పాలనలో అంతా చీకట్లు
● చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల్లో తీసుకెళ్దాం ● ఏడాది పూర్తయినా అభివృద్ధి, సంక్షేమం లేదు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదల జీవితాల్లో చీకట్లు నింపిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి విమర్శించారు. ఆలూరులోని స్థానిక ఉమా కల్యాణ మండపంలో ఆవరణలో మంగళవారం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కె. మల్లికార్జున ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితులుగా ఎస్వీ, ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు తెర్నెకల్ సురేంద్రరెడ్డి, జనార్దన్‌నాయుడు, జనరల్ సెక్రటరీ షరీఫ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి, విరూపాక్షి మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబునాయుడు ప్రజల ను హామీలతో మోసం చేశారన్నారు. గత వైఎస్సా ర్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి పేదల ఇళ్లకు నవరత్నాలు చేర్చారన్నారు. అనంతరం ‘చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పేరుతో క్యూర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. స్మార్టు ఫోన్ ద్వారా కూటమి ఇచ్చిన హామీలు ఎన్నీ.. ఎగ్గొట్టినవి ఎన్ని.. అనేది చూసుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు మండల స్థాయిలో నాయకులు గ్రామాల్లో పర్యటించి సీఎం చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.
రెడ్ బుక్‌లకు భయపడేది లేదు..
రెడ్ బుక్‌లు ఎన్నో చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నామని ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇలాంటి బుక్‌లు అమలు చేసి ఉంటే టీడీపీలో ఎవరూ ఉండేవారు కాదన్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్‌కు కూడా బాగా తెలుసునన్నారు. అబద్దాలతో పాలన కొనసాగించడం ప్రజలను మోసం చేయడమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్రరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో పీఆర్ వింగ్, ఎస్సీ సెల్, కళాకారుల వింగ్ సంయుక్త కార్యదర్శులు ఓబులేసు, మహానంది, శేషప్ప, వీరేశప్ప, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, మేధావుల సంఘం కార్యదర్శి శివానంద, జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున, యువజన రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, మైనార్టీ సెల్ కార్యదర్శి ఇమ్రాన్, జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, ఈరన్న, ఉపాధ్యక్షులు గిరి, పెద్దయ్య, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు మారయ్య, రామిరెడ్డి, షఫి ఉల్లా, రామకృష్ణ, బసవరాజ, జెడ్పీటీసీ సభ్యులు దొరబాబు, నాయకులు శ్రీరాములు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కూటమి పాలనలో అంతా చీకట్లు