
కన్నీటి కష్టాలు పట్టవా?
● ఎల్లెల్సీ నీటిలో నిలబడి మున్సిపల్ కార్మికుల నిరసన
ఎమ్మిగనూరుటౌన్: తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, సమస్యలు పరిష్కరించాలని గత 46 రోజులుగా సమ్మె చేస్తున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఇంజినీరింగ్ కార్మికులు శనివారం తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) వరకు ర్యాలీగా వెళ్లారు. కాలువలో అర్ధనగ్నంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈసందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యునియన్ నాయకులు నారాయణ, రాజేంద్ర మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్.. కార్మికుల అకౌంట్‌లో జమ చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదన్నారు.