కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాపై వరుణుడు విరుచుకుపడ్డాడు. ఏకంగా ఒకేరోజు జిల్లా మొత్తంగా సగటున 31.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోడుమూరులో 79.4, అత్యల్పంగా వెల్దుర్తిలో 12.8 మి.మీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. కోడుమూరు. దేవనకొండ, మంత్రాలయం, హలహర్వి తదితర మండలాల్లో భారీ వర్షాలు పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హంద్రీనదికి కూడా వరద నీరు వచ్చింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 59.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ విత్తనాల పంపిణీ ఊపందుకోని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులు బదిలీల్లో నిమగ్నం కావడంతో విత్తన పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇప్పటి వరకు కేవలం 7400 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి.
మండలం వర్షపాతం(మి.మీ)
కోడుమూరు 79.4
దేవనకొండ 69.4
మంత్రాలయం 60.6
హాలహర్వి 59.6
సి.బెళగల్ 56.4
ఆదోని 48.2
హొళగుంద 48.2
క్రిష్ణగిరి 46.2
పెద్దకడుబూరు 45.6
గూడూరు 45.0
పత్తికొండ 39.6
గరిష్టంగా 79.4,
కనిష్టంగా 12.8 మి.మీ వర్షం
ఒకే రోజు సగటు వర్షపాతం
31.1 మి.మీ


