
వాహనాలకు ప్రత్యామ్నాయ డ్రైవర్‌గా..
ఈ చిత్రంలోని వ్యక్తి పి.షేక్షావలి. కోసిగి మండలంలోని ఆర్లబండ స్వగ్రామం. డిగ్రీ వరకు చదువుకున్న ఇతను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్థానికంగానే వలంటీరుగా సేవలందించారు. ప్రస్తుతం ఏ పనీ లేకపోవడంతో తనకు వచ్చిన డ్రైవింగ్ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ట్రాక్టర్, ఇతర వాహనాలకు డ్రైవర్లు లేని సమయంలో యాక్టింగ్‌గా పోతున్నాడు. పనికి పోయిన రోజు రూ.500 వస్తుంది. ఇలా నెలలో వారం రోజులు కూడా పని దొరకని పరిస్థితి. వలంటీర్లకు ఎన్నో ఆశలు కల్పించిన చంద్రబాబు తమను ఇలా వీధిన పడేశాడని కన్నీరు పెట్టుకున్నాడు. ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టాడని.. మాలాంటి ఎంతో మంది పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని వాపోతున్నాడు.