నయాపైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు | - | Sakshi
Sakshi News home page

నయాపైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు

May 31 2025 1:10 AM | Updated on May 31 2025 1:10 AM

  నయా

నయాపైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు

మా గ్రామంలో వలంటీరు సుధాకర్‌ నయాపైసా ఖర్చు లేకుండా నా కొడుకులు, మనవళ్లకు ఆరోగ్యశ్రీ కార్డులు తెప్పించాడు. మా ఇంటికే వచ్చి అవసరమైన పేపర్లు తీసుకొని పోయి నాకు ఫించన్‌ కూడా వచ్చేలా చేశాడు. సొంత పనులతో పాటు పొలాలకు సంబంధించిన విషయాల్లో ఏ అవసరం వచ్చినా, వలంటీరు పనులు చేసి పెట్టారు. ఇప్పుడు ఏ అవసరం పడినా గ్రామంలోని సచివాలయాలకు, లేకపోతే తుగ్గలికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

– జల్ల రంగప్ప, ముక్కెళ్ల, తుగ్గలి మండలం

మా పిల్లల పేర్లు

రేషన్‌కార్డులో చేర్చారు

రేషన్‌కార్డులో మా పిల్లల పేర్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఈ విషయాన్ని వలంటీరు దృష్టికి తీసుకుపోయిన వెంటనే పిల్లలకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు జీరాక్స్‌ కాపీలను తీసుకుపోయి ప్రభుత్వం అవకాశం కల్పించిన సమయంలో పిల్లల పేర్లను కార్డులో చేర్పించారు. గ్రామాల్లో వలంటీర్లు నయాపైసా ఖర్చు లేకుండా అనేక కార్యక్రమాలను ప్రజలకు అందించారు. వాళ్లను వీధిన పడేయటం ఈ ప్రభుత్వానికి మంచిదికాదు.

– మదాసు శ్యామల,

చిన్నటేకూరు, కల్లూరు మండలం

  నయాపైసా ఖర్చు లేకుండా      ఆరోగ్యశ్రీ కార్డులు 
1
1/1

నయాపైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement