
డబ్బు తీసిస్తానని..
నందికొట్కూరు: పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆయలం ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఓ కేటుగాడు వృద్ధుడిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన శ్రీనివాసులు ఆచారి ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిగా అక్కడే కాపుకాసిన కేటుగాడు డబ్బు డ్రా చేసి ఇస్తానని మాయమాటలు చెప్పి మొదట అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసి డబ్బు ఉన్నాయని నిర్ధారించుకున్నాడు. అనంతరం తెలివిగా ఏటీఎంను మార్చి మరో ఏటీఎంను వృద్ధుడికి ఇచ్చి చిన్నగా అక్కడ నుంచి తప్పించుకున్నాడు. పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులో ఉన్న హెచ్‌డీఎఫ్ ఏటీఎం వద్దకు వెళ్లి అకౌంట్‌లోని రూ.25 వేల నగదును డ్రాచేసుకుని ఉడాయించాడు. డబ్బు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఏటీఎంను చెక్ చేసుకోగా అది తన ఏటీఎం కాదని గుర్తించిన బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ పట్టణంలోని ఏటీఎం సెంటర్ల వద్ద సదరు నిందితుడు వృద్ధులను మోసం చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
● ఏటీఎం వద్ద వృద్ధులను టార్గెట్ చేస్తున్న
కేటుగాళ్లు
● ఏటీఎం మార్పు చేసి రూ.25 వేలు చోరీ