
అర్జీలు చూడని అధికారులపై చర్యలు
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్‌ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్) లాగిన్‌లో వచ్చిన అర్జీలను కొన్ని శాఖల అధికారులు వారం రోజులైనా చూడడంలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఆర్వో, ఆర్‌డీఓలను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. అర్జీలను చూడకుండా ఉండడం క్రమశిక్షణ రహితమన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ వినతులు స్వీకరించారు. సీఎంఓ నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాగా.. ఖరీఫ్‌లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ వినతిపత్రం సమర్పించారు. కల్లూరు మండలం గోకులపాడు పొలిమేరలో ఉన్న పొలాలకు వెళ్లే రహదారిని ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని గోపినాథ్, యేసురాజు, బీమన్న కోరారు. కర్నూలు నగరంలో ఎస్సీ, బీసీ చిన్న పిల్లల హాస్టళ్లను వెంటనే పునః ప్రారంభించాలని వినతిపత్రం సమర్పించారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా