
కృష్ణయ్యకు మధుర నివేదన
కర్నూలు కల్చరల్: ఆధ్యాత్మిక సేవా గుణం కలిగి ఉండాలని ఇస్కాన్ కర్నూలు బాధ్యులు రఘునందన సేవక్ ప్రభు సూచించారు. ఆదివారం స్థానిక భగీరథ కాంప్లెక్స్‌లోని జగన్నాథ మందిరంలో మామిడి పండ్ల ఉత్సవం, శీల ప్రభు పాదుల ప్రేమ విందు, భగవద్గీత తరగతులు నిర్వహించారు. జగన్నాథ్, సుభద్ర, బలదేవ్‌లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు తెచ్చిన మామిడి పండ్లతో జగన్నాథ్‌కు రాజ భోగ నివేదన చేశారు. అనంతరం ఆయన సందేశమిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. భగవద్గీత పఠనం, శ్రవణంతో సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయన్నారు. చిన్నారులకు చదువుతో పాటు సంస్కారం, నైతిక విలువలు, కుటుంబ విలువలు నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్కాన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

కృష్ణయ్యకు మధుర నివేదన