
గిరిజన ఉత్పత్తులను విస్తరింపజేయండి
కర్నూలు(అర్బన్): గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరింపజేసేలా చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాల నాయకులు కోరారు. ఆదివారం ఇక్కడకు వచ్చిన గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో వైహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు, బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణనాయక్ తదితరులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులు తయారు చేస్తున్న అరకు కాఫీ ఉత్పత్తులను అన్ని జిల్లాల్లోని మార్కెట్లు, రైతు బజార్లలో గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల ద్వారా విక్రయించేందుఉ చర్యలు చేపట్టాలన్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో జీసీసీ రాష్ట్ర డైరెక్టర్ ఎస్ అరుణ్‌నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం చైర్మన్ బద్దు నాయక్, ఫ్యాప్టో చైర్మన్ సేవాలాల్, రామునాయక్, ఎరుకల హరి, చంద్రనాయక్ తదితరులు ఉన్నారు.
మద్యం దుకాణంలో చోరీ
బేతంచెర్ల: స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని రమ్య మద్యం దుకాణంలో చోరీకి జరిగినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం వెనక భాగం నుంచి వచ్చిన దొంగలు రేకును కట్ చేసిలోపలికి ప్రవేశించారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ. 3.99 లక్షలు అపహరించారు. శనివారం బ్యాంక్ సెలవు కావడంతో నిర్వాహకులు ఆ రోజు కలెక్షన్ డబ్బులు కౌంటర్‌లోనే ఉంచి వెళ్లడంతో రాత్రి చోరీకి గురైంది. సమాచారం తెలుసుకున్న క్లూస్ టీం పోలీసులు మద్యం దుకాణాన్ని పరిశీలించారు. మద్యం దుకాణం నిర్వాహకుడు భూపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
నేడు కర్నూలులో ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): రేషన్ సరుకులను ఎండీయూ వాహనాల ద్వారానే సరఫరా చేయాలని, ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలని కోరుతూ సోమవారం ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే ర్యాలీలో ఎండీయూ ఆపరేటర్లతోపాటు కార్మికులు పాల్గొనాలని కోరారు.

గిరిజన ఉత్పత్తులను విస్తరింపజేయండి