
స్వచ్ఛందంగా దాహం తీర్చుతూ..
గోనెగండ్ల: తీవ్ర తాగునీటి సమస్య నెలకొన్న పెద్దమరివీడు ప్రజల దాహార్తి తీర్చడంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఐదు రోజులకు ఒకసారి కుళాయిలకు నీరు వస్తున్నందున తాగునీటి సమస్య తీవ్రమయింది. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని గ్రామ వైఎస్సార్‌సీపీ నాయ కులు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె పెద్దమరివీడు గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మంచినీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి గ్రామస్తులకు నీటిని సరఫరా చేపట్టారు. దీంతో గ్రామ ఉప సర్పంచ్ నరసన్న ఆచారి, వైఎస్సార్‌సీపీ నాయకులు నాగేష్, చిన్న యంకన్న గౌడ్, గజేంద్ర, నరసింహుడు, గ్రామస్తులు బుట్టా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.