
కల్వర్టును ఢీకొన్న లారీ
కోడుమూరు రూరల్: ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటన బుధవారం కోడుమూరు నుంచి కర్నూలు వెళ్లే రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలు.. డోన్ నుంచి ఆదోని వైపు వెళుతున్న లారీ ప్యాలకుర్తి సమీపాన ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో రోడ్డు సైడ్కు ఉన్న కల్వర్టును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ చక్రాలన్నీ ఊడిపోవడంతో పాటు, లారీ డ్రైవర్, క్లీనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద పరిస్థితి చూస్తే ఘోర ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ఉంది. విషయం తెలుసుకున్న కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి ప్రమాద స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించి రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.

కల్వర్టును ఢీకొన్న లారీ