
గిర గిర తిరగాలి బొంగరం..!
పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఆటల్లో బిజీ అయ్యారు. మారుతున్న కాలానుగుణంగా సెల్‌ఫోన్లకు బానిస కాకుండా పిల్లలను వారి తల్లిదండ్రులు పాతకాలంనాటి ఆటల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఖోఖో, కబడ్డీ, క్యారమ్స్, బిల్లంగోడు, బొంగరాలు, తదితర ఆటలపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో నాగుల కట్ట సమీపంలో కొందరు పిల్లలు బొంగరాల ఆట ఆడుతూ కనిపించారు. – కోవెలకుంట్ల