ఆదోని మున్సిపల్‌ తాత్కాలిక చైర్మన్‌గా ఎంఎం గౌస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదోని మున్సిపల్‌ తాత్కాలిక చైర్మన్‌గా ఎంఎం గౌస్‌

Apr 29 2025 9:18 AM | Updated on Apr 30 2025 2:04 AM

ఆదోని మున్సిపల్‌ తాత్కాలిక చైర్మన్‌గా ఎంఎం గౌస్‌

ఆదోని మున్సిపల్‌ తాత్కాలిక చైర్మన్‌గా ఎంఎం గౌస్‌

ఆదోని టౌన్‌: ఆదోని మున్సిపల్‌ తాత్కా లిక చైర్మన్‌గా ఎంఎం గౌస్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ పరిపాలన శాఖ కార్యదర్శి సోమవారం ఆదేశాలు జారీ చేశారని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.కృష్ణ తెలిపారు. ఎంఎం గౌస్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌–1గా కొనసాగుతున్నారు. అయితే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోయ శాంతపై ఈనెల 16వ తేదీన పాలకవర్గ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను పదవి నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ మేరకు వైస్‌ చైర్మన్‌–1 ఎంఎం గౌస్‌ను తాత్కాలిక మున్సిపల్‌ చైర్మన్‌గా కొనసాగాలని ఉత్తర్వు లు అందాయన్నారు. త్వరలో చైర్మన్‌ ఎన్నికపై పాలకవర్గ సభ్యులతో సమావేశం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement