
భావితరాలకు బషీర్ గురుతులు
జూపాడుబంగ్లా: పాణ్యం మండలం సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన షేక్ బషీర్ స్థానిక హైస్కూల్‌లో ఆరోతరగతి విద్యనభ్యశించే సమయంలోనే వైరెటీగా కనిపించే నాణేలను దాచుకునేవాడు. ఐదు, పది, ఇరవై పైసల నాణేలతో పాటు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లను భద్రపరుచుకునేవారు. కాక్రమేణా కాయిన్స్, నోట్లు, స్టాంపుల సేకరణను అలవాటుగా చేసుకున్నారు. బాల్యంలో ప్రారంభమైన హాబీ.. చదువు పూర్తయి ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటూ జూపాడుబంగ్లాలో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నా కొనసాగిస్తున్నారు. టూర్లకు వెళ్లినప్పుడు అక్కడ విక్రయించే పలు దేశాల నాణేలు, కరెన్సీనోట్లు, స్టాంపులను పరిశీలించి తన వద్దలేని వాటిని కొనుగోలు చేసేవారు. ఇప్పటిదాకా రూ.50 వేలు ఖర్చు చేసి పలు దేశాల కాయిన్స్, నోట్లు, స్టాంపులు సేకరించి వాటిని ఇంట్లో గోడలకు అతికించి ఫ్రేమ్ కట్టించినట్లు బషీర్ తెలిపారు.
జ్ఞాపకాల దొంతర..
బషీర్ పాతకాలం నాటి గ్రాంఫోన్‌రికార్డు, టేప్‌రికార్డర్, కెమెరాలు, ఆడియో కేసెట్లు, డీవీడీ ప్లేయర్లు సేకరించి భద్రపరిచారు. ఇంటికి వచ్చిన వారు వాటిని చూసి తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ బషీర్‌ను అభినందిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు, విక్టోరియా మహారాణి కాలం నాటి కాయిన్స్ కూడా ఉన్నాయి. 1947 స్వాతంత్య్రం వచ్చాక ఇండియా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్న అర్ధ ఆణ, ఆణ, పైస, రెండుపైసలు, ఐదుపైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా, ఐదు రూపాయలు, పదిరూపాయల కాయిన్స్ సేకరించారు. ఒమన్, మస్కట్, సౌదీ, దుబాయ్, మలేషియా, సింగపూర్, అమెరికా, పాకిస్తాన్ తదితర 20 దేశాలకు చెందిన ప్లాస్టిక్స్ కరెన్సీ నోట్లు, కాగితపు కరెన్సీనోట్లను సేకరించారు. ఇంగ్లాండ్, ఒమన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కేఎస్‌ఏ, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేటెడ్, కువైట్, బంగ్లాదేశ్, ఇండియాకు చెందిన రాణాప్రతాప్‌సింగ్, నెహ్రూ, మొట్టమొదటి రైలు ఇంజిన్ స్టాంపు, ఆయిల్‌ఎక్స్‌ప్రోషన్, టెక్నాలజీడే స్టాంపు, నహర్‌సింగ్, వంటి అనేక చిత్రాలతో కూడిన పోస్టల్ స్టాంపులున్నాయి.
పురాతన కాలం నాటి కెమెరాలు, గ్రామ్‌ఫోన్, కేసెట్లు సేకరించి భద్రపరుస్తున్న పంచాయతీ రాజ్ ఏఈ బషీర్
20 ఏళ్లుగా పలు దేశాల కరెన్సీ, స్టాంపుల సేకరణ
పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా విధులు నిర్వహించే బషీర్.. పురాతన వస్తువులు, వివిధ దేశాల కరెన్సీ సేకరించి భావితరాలకు తెలియజేసేందుకు భద్రపరుస్తున్నాడు. ఇప్పటి వర కు ఏకంగా 20 దేశాల కరెన్సీతో పాటు పాతకాలపు గ్రామ్‌ఫోన్, రేడియో, కేసెట్లు, కెమెరా లు తన అల్మారాలో ఆకర్షణీయంగా దాచి ఉంచాడు. ఆరో తరగతిలో ప్రారంభమైన కరెన్సీ సేకరణ ఆరు పదుల వయస్సు వచ్చినా కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

భావితరాలకు బషీర్ గురుతులు

భావితరాలకు బషీర్ గురుతులు

భావితరాలకు బషీర్ గురుతులు

భావితరాలకు బషీర్ గురుతులు

భావితరాలకు బషీర్ గురుతులు