
వైద్యపరికరాల కొనుగోలుకు ఆమోదం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వైద్యపరికరాల కొనుగోలుకు పర్చేజ్ కమిటీ ఆమోదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో పలు వైద్యపరికరాల కొనుగోలుకు కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆటో క్లియర్, ఎయిర్ కంప్రెషర్, ఏఎంసీలో ఆక్సిజన్ ప్యానెల్, రెండు హీమోడయాలసిస్ మిషన్లు కొనుగోలు చేయడానికి కమిటీ ఆమోదించిందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు జనరల్ సర్జరీ హెచ్‌ఓడి డాక్టర్ పి.హరిచరణ్, ఆర్థోపెడిక్ హెచ్‌వోడి డాక్టర్ కె.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజి హెచ్‌వోడి డాక్టర్ పి.శ్రీనివాసులు, అనెస్తీషియా హెచ్‌వోడి డా క్టర్ జి.విశాల, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.లక్ష్మిబాయి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.