
అక్రమ మద్యం విక్రేతల అరెస్టు
కర్నూలు: కల్లూరు ఎస్టేట్‌లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కల్లూరు ఎస్టేట్‌కు చెందిన జక్కల మునయ్య వద్ద 22 మద్యం బాటిళ్లు, దేవర ఆంజనేయులు వద్ద 15 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి సారా విక్రయాలు జరుపుతున్న నీలిషికారి ఆనరి వద్ద 20 లీటర్లు, నీలి షికారి లక్ష్మి వద్ద 30 లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు నవీన్ బాబు, రెహనా బేగం, కానిస్టేబుళ్లు మధు, సూర్యనారాయణ, రామలింగయ్య, ఈరన్న, సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.