వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాది(2019–20)లో ఒక్క రూపాయి ప్రీమియంతో నోటిఫై చేసిన పంటలకు బీమా సదుపాయం కల్పించింది. 2020–21 నుంచి వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు పంటల బీమా సదుపాయాన్ని వర్తింపజేసింది. సన్న, చిన్న, మధ్య అనే తారతమ్యం లేకుండా, రాజకీయాలకు అతీతంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా రైతులకు బీమా సదుపాయం కల్పించడం విశేషం. ఉచిత పంటల బీమా కింద రైతన్నలకు చెల్లించిన పరిహారం రూ.1065.61 కోట్లు. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశారు.