
ఎస్పీని కలసిన సెబ్ సూపరింటెండెంట్
కర్నూలు: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కర్నూలు సూపరింటెండెంట్‌గా రవికుమార్ జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా సెబ్ అడిషనల్ ఎస్పీగా ఉన్న కృష్ణకాంత్ పటేల్ విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా బదిలీ కావడంతో సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పనిచేస్తున్న రవికుమార్‌ను కర్నూలుకు నియమిస్తూ సెబ్ కమిషనర్ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన శుక్రవారం విధుల్లో చేరి ఎస్పీ కృష్ణకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా గనపవరానికి చెందిన రవికుమార్ 1998లో ఎకై ్సజ్ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. అనంతపురం జిల్లా పెనుగొండ, పుట్టపర్తి ప్రాంతాల్లో పనిచేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి బదిలీపై కర్నూలుకు వచ్చారు.
91 శాతం పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చురుగ్గా సాగుతోంది. రెండు రోజుల్లోనే 91 శాతంపైగా పింఛన్లు పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 2,48,239 మంది లబ్ధిదారులకు గాను 2,27,506 మందికి(91.65 శాతం)కి పింఛన్లు అందించారు. నంద్యాల జిల్లాలో 2,24,398 మందికి లబ్ధిదారులకు గాను 2,04567మందికి(91.16 శాతం) పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది.
పారారోయింగ్‌లో ప్యాపిలి క్రీడాకారుడి ప్రతిభ
ప్యాపిలి: మహారాష్ట్రలో జరిగిన జాతీయ పారా రోయింగ్ పోటీల్లో ప్యాపిలికి చెందిన వెంకటనారాయణ ప్రతిభ చాటాడు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు పూణేలో జరిగిన ఈ పోటీల్లో హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల క్రీడాకారులతో ఆంధ్రప్రదేశ్ తరపున వెంకటనారాయణ తలపడ్డాడు. రెండు కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల 10 సెకన్లలో రోయింగ్ చేసి బంగారు పతకాన్ని సాధించాడు. 500 మీటర్ల దూరాన్ని 1 నిమిషం 55 సెకన్లలో సాధించి బంగారు పతకాన్ని సాధించాడు. పారా రోయింగ్‌లో ప్రతిభ చాటిన వెంకటనారాయణను స్థానికులు అభినందించారు.

బంగారు పతకాలు సాధించిన వెంకటనారాయణ