మాట్లాడుతున్న సుభాష్ చంద్రబోస్
కర్నూలు(అర్బన్): వాల్మీకుల చిరకాల కోరికను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ నెల 2వ తేదీన కర్నూలులో వాల్మీకుల మహా ప్రదర్శన, భారీ సభను నిర్వహిస్తున్నట్లు వీఆర్‌పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శనివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాల్మీకులకు ముఖ్యమంత్రి జగనన్నే ధైర్యం, నమ్మకం అన్నారు. పాదయాత్రలో వాల్మీకుల స్థితిగతులను స్వయంగా చూసిన ఆయన నాడు ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఈ తీర్మాణం పార్లమెంట్‌లో ఆమోదం పొందేంతవరకు వీఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. నేడు చేపట్టనున్న కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా వాల్మీకులు కలిసిరావాలని ఆయన కోరారు. స్థానిక జిల్లాపరిషత్ నుంచి మహర్షి వాల్మీకి విగ్రహం వరకు మహా ప్రదర్శన, అనంతరం సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వీఆర్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలపల్లి లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షులు మొలగవెల్లి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
వీఆర్‌పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్


