బాబు డ్రామాలు | - | Sakshi
Sakshi News home page

బాబు డ్రామాలు

Mar 31 2026 8:56 AM | Updated on Mar 31 2026 8:56 AM

అమరావతి పేరుతో జెడ్పీ సీఈవోగా అరుణ

ప్రజలను పక్కదారి పట్టించేందుకే అసెంబ్లీ తీర్మానం అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టా...? లేక సెల్ఫ్‌ డబ్బా ప్రాజెక్టా...? రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌ కోసమే ‘తీర్మానం’ జిమ్మిక్కులు జగన్‌ అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు.. మీడియా సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

అమరావతి పేరుతో

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): అమరావతిపై తీర్మానం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ ‘పశ్చిమ’ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెలంపల్లి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం.. కేవలం రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఆడుతున్న డ్రామా అని తెలిపారు. 2028 లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మరోపక్క ‘రాజధాని మార్చేస్తారు’ అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

అవినీతి బయటపడుతుందనే కౌన్సిల్‌ను పక్కన పెట్టారు

కౌన్సిల్‌ను పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం వెనుక.. అవినీతి బయటపడుతుందనే భయమేనని వెలంపల్లి స్పష్టం చేశారు. రైతులను మభ్యపెట్టి రెండో విడత పూలింగ్‌ కోసం ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు అంటే, మొత్తం ప్రాజెక్టుకు రూ. 2 లక్షల కోట్లు పైగా అవసరమవుతాయని, ఇంత భారాన్ని భరించే శక్తి రాష్ట్రానికి ఉందా అని ప్రశ్నించారు. కేవలం డిజైన్ల పేరుతో రూ. 400 కోట్లు వృఽథా చేశారని ఆయన విమర్శించారు.

అవినీతికి పరాకాష్ట

టెండర్లను కొద్దిమంది అనుచర కంపెనీలకే కట్టబెడుతున్నారని, నాలుగు శాతం ఎక్సెస్‌తో పనులు ఇవ్వడం అవినీతికి పరాకాష్ట అని వెలంపల్లి అన్నారు. 2024 జూన్‌ తర్వాత తీసుకున్న రూ. 13 వేల కోట్ల రుణాల్లో రూ. 5,000 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల రూపంలో కమీషన్ల కోసం ఇచ్చారని ఆరోపించారు. రూ. 47,000 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నారని, వీటిని ఎవరు తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని, కేవలం అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సైతం అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేస్తూ, తమకు ఆ ప్రాంతంపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. అయితే హైపర్‌లూప్‌, ఒలింపిక్స్‌ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న వెలంపల్లి శ్రీనివాసరావు

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జె.అరుణను నియమిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారిగా పని చేస్తున్న ఆమెను ఉద్యోగోన్నతిపై సీఈవోగా నియమించారు. ఇప్పటి వరకు జెడ్పీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.కన్నమనాయుడు ను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement