సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Mar 31 2026 8:56 AM | Updated on Mar 31 2026 8:56 AM

● గుడివాడ మండలం లింగవరం గ్రామానికి చెందిన కె.చిలకమ్మ తాను ప్రమాదంలో ఒక కాలు కోల్పోయానని, ప్రస్తుతం ప్లాస్టిక్‌ కాలు సహకారంతో జీవనం సాగిస్తున్నానని, తనకు పింఛన్‌ ఇప్పించాలని ఆమె జేసీకి విన్నవించుకుంది. దీనిపై జేసీ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పింఛన్‌ మంజూరు చేస్తామని.. తక్షణమే మూడు చక్రాల సైకిల్‌ను అందజేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ● రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వెట్టిచాకిరీ చేయించుకుంటూ ఎల్‌పీజీ గ్యాస్‌ డీలర్ల వద్ద పనిచేసే కార్మికులకు డీలర్లు వేతనాలు ఇవ్వడం లేదని సంబంధిత వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం పౌర సంక్షేమ సంఘం నగర కన్వీనర్‌ కొడాలి శర్మ అర్జీ ఇచ్చారు. ● గన్నవరం మండలం వెదురుపావులూరులో దాదాపు 3,500 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న పంట సాగు జరుగుతోందని దళారులు మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆ ప్రాంతంలో ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తుడు పాలడుగు రత్నారావు జేసీకి అర్జీ ఇచ్చారు.

జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ మీ కోసంలో 122 అర్జీలు స్వీకరణ

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, డిస్ట్రిక్ట్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ పోతురాజు, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

అర్జీల్లో కొన్ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement