కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 u8లో చిలకలపూడి(మచిలీపట్నం): చంద్రబాబు సర్కార్.. ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో తీసుకున్న ‘ప్రైవేట్’ విధానాలపై ప్రజలు సంతకాలతో నిరసన స్వరం వినిపించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణకు ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. కృష్ణా జిల్లాలో చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమ ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సోమవారం తరలించనున్నారు. వైద్య విద్యపై చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, మేధావులు, యువకులు, విద్యార్థులు సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ పిలుపు మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ప్రజలకు చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాన్ని వివరించారు. ఈ ఉద్యమానికి తాము కూడా వెన్నంటే ఉంటామని మద్దతు పలికారు. అంతేకాకుండా టీడీపీకి చెందిన పలువురు నాయకులు కూడా మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయడం మంచి ఆలోచన కాదని తాము కూడా మద్దతు పలుకుతామని బాహాటంగా వారు సంతకాలు చేయడం ఆ పార్టీ నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయా నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీతో పూర్తి చేశారు.
నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి.. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి 3,62,815 సంతకాల ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయం నుంచి సోమవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఉదయం 9 గంటలకు మచిలీపట్నంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వాహనం ద్వారా వీటిని తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) నేతృత్వంలో ఏడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల సమక్షంలో ఈ ప్రతులను తరలించే కార్యక్రమాన్ని నిర్వహించ నున్నారు. ఇందుకోసం ఉదయం 9 గంటలకు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఆయా నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోనేరుసెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి సంతకాల ప్రతుల వాహనాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) జెండా ఊపి పంపనున్నారు. కరుణించమ్మా.. కనకదుర్గమ్మా
న్యూస్‌రీల్
సంతకాల సేకరణ ఇలా
ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమం ఆపేది లేదు
కృష్ణాజిల్లా వ్యాప్తంగా 3.62 లక్షల సంతకాలు
చంద్రబాబు ‘ప్రైవేట్’ విధానంపై
ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన
మాజీ సీఎం వైఎస్ జగన్
కోటి సంతకాలకు ప్రజల
నుంచి భారీ స్పందన
నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా
పార్టీ కార్యాలయానికి చేరిన సంతకాలు
నేడు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి
కేంద్ర కార్యాలయానికి సంతకాల
ప్రతుల తరలింపు
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం
నుంచి కోనేరు సెంటర్ వరకు భారీ ర్యాలీ
నేడు మీ కోసం
ఉత్సాహంగా సాక్షి స్పెల్‌బీ
గుడివాడలో అగ్నిప్రమాదం
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై..
నియోజకవర్గం సంతకాల సంఖ్య
మచిలీపట్నం 65,000
పామర్రు 50,815
గుడివాడ 60,000
అవనిగడ్డ 54,000
పెడన 43,000
గన్నవరం 40,000
పెనమలూరు 50,000
మొత్తం 3,62,815
పతకాల వీరుడు @59
7
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. డివిజన్, మండలస్థాయిలో కూడా మీ కోసం జరుగుతుందని పేర్కొన్నారు.
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం విజయవాడ నలంద డిగ్రీ కాలేజీలో ఉత్సాహంగా జరిగాయి.
గుడివాడరూరల్: గుడివాడ మెయిన్‌రోడ్డు లోని అద్దేపల్లి కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం సంభవించింది.
1/8
కృష్ణాజిల్లా
2/8
కృష్ణాజిల్లా
3/8
కృష్ణాజిల్లా
4/8
కృష్ణాజిల్లా
5/8
కృష్ణాజిల్లా
6/8
కృష్ణాజిల్లా
7/8
కృష్ణాజిల్లా
8/8
కృష్ణాజిల్లా