ఏపీఆర్‌ఎస్‌ఏ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీఆర్‌ఎస్‌ఏ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. గవర్నర్‌పేటలోని ఏపీ ఆర్‌ఎస్‌ఏ భవన్‌లో ఆదివారం కార్యవర్గ సమావేశం జరిగింది. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా బత్తిన రామకృష్ణ, కార్యదర్శిగా యలమంచిలి రవి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా చందన దుర్గాప్రసాద్, కోశాధి కారిగా జి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్వీ రవీంద్రనాథ్, జి.వెంకటేశ్వరరావు, జె. వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్.అనూష్‌కుమార్, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా కమ్మిలి నాగభూషణం, ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2028 వరకు పదవిలో కొనసాగుతుంది. ఎన్నికల అధికారులుగా బి.పుల్లయ్య, దుర్గాప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్వీ రాజేష్, పి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
వక్కలగడ్డకు చెందిన హెడ్ కానిస్టేబుల్‌కు బంగారు పతకాలు ఆర్టీఓలో డ్రైవర్
సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ రవాణాశాఖ, భారత్ కేర్ భాగస్వామ్యంతో డియాజియా ఇండియా(యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ) విజయవాడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ‘రాంగ్ సైడ్ ఆఫ్ ది రోడ్’లో భాగంగా ఏర్పాటు చేసిన నూతన ల్యాబ్‌ను ఆదివారం డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (రోడ్ సేఫ్టీ) మీరాప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. రోడ్డు భద్రత, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించాలనే డియోజియో ఇండియా లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. డీటీసీ మీరా ప్రసాద్ మాట్లాడుతూ నిరంతర అవగాహన, ప్రవర్తనా మార్పు కార్యక్రమాల ద్వారా ప్రమాదాలను తగ్గించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. విజయవాడలోని కార్యాలయంలో డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్.. కొత్త డ్రైవర్లను ఆచరణాత్మక, అనుకరణ ఆధారిత అభ్యాసంతో సన్నద్ధం చేయడం ద్వారా మా ప్రయత్నాలను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో డియాజియో ఇండియా కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ దేవాశిష్ దాస్‌గుప్తా మాట్లాడుతూ విజయవాడలో ప్రారంభించిన ల్యాబ్‌తో దేశ వ్యాప్తంగా 84 ల్యాబ్‌లు ప్రారంభించినట్లయిందన్నారు.
జనసంద్రం..
కార్తికేయుని ఆలయం
చల్లపల్లి: చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన వృత్తిరీత్యా విశాఖపట్నంలో హెడ్‌కానిస్టేబుల్‌గా చేస్తున్న మురాల నాగమల్లేశ్వరరావు 7వ ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటారు. రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నాగమల్లేశ్వరరావు 40–45 ఏళ్ల క్రీడాకారుల విభాగంలో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం నిర్వహించిన పోటీల్లో విశాఖ జిల్లా తరఫున పాల్గొని గెలుపొందారు. ఐదు కిలోమీటర్లు, 1500 మీటర్లు పరుగు పందేల్లో బంగారు పతకాలు, 110 హర్డిల్స్ పందెంలో వెండి పతకాన్ని కై వసం చేసుకున్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం జనసంద్రంగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగర్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
1/1
ఏపీఆర్‌ఎస్‌ఏ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక